• Login / Register
  • జాబ్ న్యూస్‌

    TGPSC Gropu 2 Exam | సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు

    TGPSC Gropu 2 Exam | సీసీ కెమెరాల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు
    నేటి నుంచి గ్రూప్‌-2 ప‌రీక్ష‌లు
    ఏర్పాట్లు పూర్తి చేశాం :  టీజీపీఎస్సీ ఛైర్మ‌న్ వెంక‌టేశం
    Hyderabad :  తెలంగాణ రాష్ట్రంలో ఆదివారం, సోమ‌వారం ( ఈ నెల 15, 16 తేదీల‌లో) నిర్వ‌హించ‌నున్న గ్రూప్‌-2 ప‌రీక్ష‌ల‌ను సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని, అభ్యర్థులు పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌పై నమ్మకముంచి పరీక్షలు రాయాలని టీజీపీఎస్సీ నూత‌న ఛైర్మ‌న్ బుర్రా వెంక‌టేశం ప్ర‌క‌టించారు. ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ‌కు సంబంధించిన అంశంపై అభ్యర్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దని స్ప‌ష్టం చేశారు. అయితే తెలంగాణ గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ తెలిపారు. ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఏర్పాట్ల‌పై శ‌నివారం నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీ కోసం ఈ నెల 15, 16 తేదీల్లో నిర్వహించ‌నున్న‌ గ్రూప్‌ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రకటించారు. గత 10 రోజులుగా పరీక్షల నిర్వహణపై స‌మీక్ష‌లు జ‌రుగుతున్నాయ‌న్నారు. ఈ పోస్టుల భ‌ర్తీ కోసం 2022లో నోటిఫికేషన్ విడుదలైంది.  అయితే సుప్రీంకోర్టు, హైకోర్టు కేసుల్లో గెలిచి పూర్తి స్థాయిలో పరీక్షలు నిర్వహిస్తున్నామని ఈ మేర‌కు ఛైర్మ‌న్ తెలిపారు. అయితే గ్రూప్‌-2  ప‌రీక్ష‌ల కోసం  రాష్ట్ర వ్యాప్తంగా 1368 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నామన్న‌ట్లు తెలిపారు. అభ్యర్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా పరీక్షలు రాయాలని సూచించారు. 
    వెనువెంట‌నే ఫలితాలు..
    ఈ ప‌రీక్ష‌ల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5.51 లక్షల మందికి పైగా అభ్యర్థులు హాజ‌రుకానున్నారు. అందుకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను 58 స్టోరేజ్ పాయింట్లు వ‌ద్ద భ‌ద్ర‌ప‌రిచామ‌న్నారు. 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం పట్టిందని,  ఈసారి చాలా వేగంగా ఫలితాలు చేయాల‌నే ఆలోచ‌న చేస్తున్న‌ట్లు ఛైర్మ‌న్ పేర్కొన్నారు. `గ్రూప్-2 పరీక్షలను పూర్తిస్థాయి సన్నద్ధతతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహిస్తుంది. అభ్యర్థులు తమ మెరిట్ ను నమ్ముకుని పరీక్షలు రాయండి. సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశాం. ఇప్ప‌టి నుంచే సీసీ కెమెరాలు వర్కింగ్ లో ఉన్నాయి. పరీక్ష పేపర్ ఓపెన్ దగ్గర నుంచి ప్రతి విషయాన్ని ప‌ర్య‌వేక్ష‌ణ‌ చేస్తాం. పరీక్షపేపర్ లో ఏముందనేది అభ్యర్థికి తప్ప ఇంకెవ్వరికీ తెలియదు`` అని  బుర్రా వెంకటేశం తెలిపారు. 
    ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా `65 వేల మంది సిబ్బంది పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థుల పరీక్షలు రాయానికి సిద్ధంగా ఉంటారు. పోలీసులు, ఇతర సిబ్బందితో కలిసి మొత్తం 75 వేల మంది సిబ్బంది గ్రూప్-2 విధుల్లో ఉంటారు. అయితే రాష్ట్ర వా్య‌ప్తంగా మొత్తం 783 పోస్టులకు 5,51,847 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే ఇప్పటి వరకూ 85 శాతం హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. 4 లక్షలకు పైగా అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని భావిస్తున్నామ‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. ఎవరి ఓఎమ్ఆర్ షీట్ లో వాళ్లే పరీక్ష రాయాల‌ని, బయోమెట్రిక్ వేయకుండా పరీక్ష రాసేందుకు వీలు ప‌డుద‌న్నారు. ఈ మేర‌క నిబంధ‌న‌లు రూపొందాయ‌ని తెలిపారు.
    *  *  * 

    Leave A Comment